Tuesday, November 25, 2008

సెక్స్ పార్టీ

ఆస్ట్రేలియాకి చెందిన ఫియోనా పాటెన్ అనే పెద్ద మనిషి ‘ద ఆస్ట్రేలియన్ సెక్స్ పార్టీ’ స్థాపించేడట!

శృంగారాన్ని ఇష్టపడే వాళ్ళందరూ పార్టీలొ చేరి, వోట్లు వేసి, సీట్లు సంపాదిస్తే, అధికారం సంపాదించుకోవచ్చనిట!

రసవత్తరంగా ఆయన ప్రకటించిన యెన్నికల ప్రణాళికలో యేమి వుంటాయో మీరే వూహించుకోండి!

Tuesday, November 11, 2008

శృంగారమంటే?

శృంగాలకి (కొమ్ములకి) సంబంధించినది!

శ్రు (మంచి)+అంగారానికి (నిప్పుకి) సంబంధించినది!

సృష్టి కార్యానికి సంబంధించినది!

అది ఒక అనుభూతి!

కాదు! కాదు! ఒక అనుభవం!

భార్యా భర్తలు అనుభవించేది!

స్త్రీ పురుషులు అనుభవించేది!

మరి, జంతువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, సరీసృపాలు, మొక్కలు, చెట్లు, పువ్వులు--లాంటివాటి మాటో?

భగవంతుడి పేర్లకి {వేం (పాపములను) + కట (హరించువాడు}, {సా (పాపములను) + యి (హరించువాడు)--ఇలా ఏ రెండక్షరాల పేరుకైనా, అదే అర్ధం!

భగవంతుడు అంటే, 'భగం' కలవాడు--అంటాడో తెల్లగడ్డం, నెత్తికి కాషాయరంగు బట్టచుట్టుకున్న ఓ స్వామి! (వాడి భగం వీడేమి చూశాడో మరి!)

యెవరికి తోచిన నిర్వచనం వారిది!

మరి శృంగారమంటే?

"ఆహార, నిద్రా, భయ మైధునాదులు" యెవరికి వారే ఆచరించేవి!

అలాంటిదే, అదే శృంగారం!