Sunday, December 13, 2009

యాగాలు


అశ్వమేధం


అంటే--  


యజమానుడు అనగా యాగం చేస్తున్న మహారాజు!  


ఆయనని ఒక మేలుజాతి అశ్వం అంటే గుర్రం మీదకి ఆవాహన చేశేవారు.  


ఆ తరవాత, యజమాన ప్రమదా--అంటే ఆ రాజుగారి భార్య--మహారాణి యొక్క  


వికస్వర భగం--లో, న్యస్త--వుంచబడిన, అశ్వ--గుర్రము యొక్క, దీర్ఘ స్మర--పొడవైనట్టి, గట్టిదైనట్టి, ధ్వజదండంబు--మేఢ్రము


--అయిన మఖ తంత్రము నిరీక్షించాడట!  


అర్థమయ్యిందిగా--ఈ తంత్రం యేమిటో?  


ఆ తరవాత, ఆ అశ్వాన్ని దేశం మీద వదిలి, మహారాజుగారే దేశం అంతా తిరిగి వచ్చినట్టు భావించి, యెవరూ దాన్ని బంధించడానికి సాహసించక పోతే, వాళ్ళందరినీ జయించినట్టు భావించేవారు!  


చివరిలో, ఆ అశ్వాన్ని నవరంధ్రాలూ మూసి, బలిచేసి, ముక్కలుగాచేసి, అగ్నిలో హోమం చేసేవారు--మంత్ర సహితం గా!  


అక్కడితో ఆ అశ్వమేధ యాగం ముగిసేది. రాజుగారి చక్రవర్తిత్వం నిరూపితం అవడమే కాకుండా, దీర్ఘాయువు కలిగేది (ట!).


అదండీ అశ్వమేధ యాగ తంత్రం!

Tuesday, December 1, 2009


Friday, November 20, 2009

మాంద్యమా--మజాకా?


ప్రోత్సహకాలూ, రాయితీలు


నెదర్లాండ్స్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, టర్కీ, జర్మనీ దేశాల్లో 'వ్యభిచారం' చట్టబధ్ధం చెయ్యబడిందిట.  


ముఖ్యం గా జర్మనీలో సుమారు 4,00,000 మంది వ్యభిచారిణులున్నారట!  


ఇప్పుడు మాంద్యం దెబ్బతో, సృజనాత్మకి పదునుపెడుతున్నారట--సెక్స్ వర్కర్లు.  


ప్రోత్సాహకాలూ, రాయితీలూ ఇస్తున్నారట--విటులకి.  


'ఫీజు' తగ్గించారట.  


సీనియర్ సిటిజన్లకీ, టాక్సీ డ్రైవర్లకీ 'ప్రత్యేక తగ్గింపులు' ప్రకటించారట.  


రెగ్యులర్ కస్టమర్ల కోసం 'డే పాసులు' రూపొందించారట.  


ఇంకా, బెర్లిన్ లో--ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకూ, 'అన్ లిమిటెడ్ మందు, విందు, పొందు' ఆఫర్ ప్రకటించాయట ప్రముఖ కంపెనీలు!  


వినడానికే యెంత బాగుందో!





Friday, September 18, 2009

యాగాలు


అశ్వమేధం

శృంగార నైషధం లోనో, కాశీ ఖండం లోనో మహాకవి శ్రీనాథుడు కలి ప్రవేశ ఘట్టాన్ని వర్ణిస్తూ, పనిలోపనిగా అశ్వమేధ యాగాన్ని వర్ణించాడట.  


"యజమాన ప్రమదా వికస్వరభగ న్యస్తాశ్వ దీర్ఘ స్మర ధ్వజదండంబౌ నయ్యశ్వమేధ మఖ తంత్రంబున్నిరీక్షించి, యక్కలిపురుషుడొత్తిలి నవ్వె!" అని!  


ఆ 'తంత్రం' గురించి యేమి అద్థం అవుతోంది?  


రాజసూయం గురించి కూడా తాపీ ధర్మారావుగారు అనుకుంటా వివరించారు.  


అది మరోసారి!

Tuesday, June 2, 2009

చక్కటి పలకరింపు

అనగానగా ఆఫ్రికా ఖండం లో ‘ఫిగోటో వబూకా’ అనే ఒక దీవి వుందట.

దాని ప్రత్యేకతేమిటంటే, అక్కడ సెల్ ఫోన్లూ, ఇంటర్నెట్లూ వగైరా వున్నా, వాళ్ళు తమ కట్టూ, బొట్టూ, ఆచార వ్యవహారాలని కొన్ని వేల యేళ్ళ నించీ ‘అలాగే’ కొనసాగిస్తున్నారట!

అవేమిటి? తెలుసుకోవాలని ఉత్సుకతగా వుందా?

అక్కడికే వస్తున్నా!

వాళ్ళల్లో, పిల్లల్ని కనవలసిన అవసరం వస్తే తప్ప, ఆడా, మగా తేడా పాటించరట!

యెవరైనా, వాళ్ళ పొత్తికడుపు పైన బొడ్డు వరకూనూ, తొడలూ (మోకాళ్ళవరకూ) కప్పుకోవాలట!
అలాగే, మెడ రెండుపక్కలా, భుజాల మీంచి మోచేతులవరకూ కప్పుకోవాలట!

అంటే, చర్మాలతోటీ, ఆకులతోటి, తీగలతోటీ—ఇలాగన్నమాట!

ఆ కప్పుకోవడంలో కూడా, అందాలు తొంగిచూడవచ్చట!

చాతీనిగానీ, పొత్తికడుపుక్రింద తొడల మధ్యభాగాన్నిగానీ కప్పుకోవడం పూర్తిగా నిషిద్ధమట!

ఇక పోతే, వాళ్ళు ఒకర్నొకరు పలకరించుకొనే పద్ధతి యేమిటంటే—యవరైనా యెదురుపడగానే, వాళ్ళ నడుము వెనక యెడమ చెయ్యి వుంచి, దగ్గరగా తీసుకొని, (తొడలమధ్య ప్రదేశాలు యేకమయ్యేలా) కుడిచేతిని యెదటివాళ్ళ కుడి రొమ్ము మీద ఆనించాలట! అలాచేసి, మూడు సార్లు నాలుక తడి చేసుకొని, చొంగ కార్చాలట!—అదీ పద్ధతి!

బాగానే వుందిగానీ, అక్కడే, ఆడామగా తేడా తెలిసి, పిల్లల్ని పుట్టించాల్సిన అవసరం గుర్తొచ్చి, వాళ్ళ జనాభా తామరతంపరగా వృద్ధి చెందడం కొస మెరుపు!

మరి వాళ్ళక్కూడా ప్రపంచ బ్యాంకు నిధులు సమకూరుస్తోందట! వాళ్ళ పోషణకి!

Wednesday, May 20, 2009

‘గంపెడు పిల్లల్ని కని…..’

‘......వాళ్ళని పెంచి, పోషించి, కలకాలం పిల్లల కోడిలా వర్ధిల్లు!’ అని కొత్తగా పెళ్ళైన జంటని దీవించేవారు—ముఖ్యంగా తల్లీ, అమ్మమ్మలూ!

పెళ్ళైపోగానే, పురోహితుడు, ‘శీఘ్రమే గర్భాదాన సుఖ ప్రాప్తిరస్తు’ అని ఆశీర్వదిస్తాడు!

మిగిలిన దంపతులందరూ, పెళ్ళి కొడుకుని ‘దీర్ఘాయుష్మాన్ భవ’ అనీ, పెళ్ళి కూతుర్ని ‘దీర్ఘ సుమంగళీ భవ’ అనీ ఆశీర్వదిస్తారు!

అసలు దీవెనకీ, ఆశీర్వచనానికీ తేడా వుందా? వుంటే అది యేమిటి?

దాసరి నారాయణ రావుని అడిగితే, కొల్లేటి చాంతాడంత డైలాగు చెపుతాడు—‘దీవెన వేరు, ఆశీర్వచనం వేరు! దీవెన ఆశీర్వచనం కాదు, ఆశీర్వచనం దీవెన కాదు! దీవెన దీవెనే! ఆశీర్వచనం ఆశీర్వచనమే! అలాగని ఒక్కొక్కసారి దీవెనే ఆశీర్వచనం అవుతుంది, మరొక్కసారి ఆశీర్వచనమే దీవెన అవుతుంది! అయినా, యెప్పుడూ దీవెన ఆశీర్వచనం కాదు, ఆశీర్వచనం దీవెన కాదు!...............’ ఇలా వెళ్ళిపోతుంది ప్రవాహం!

మరి అసలు వీటి మధ్య తేడా వుందా?

దీవెన అంటే, మన ‘ఆకాంక్ష’ని వారికి తెలియ చెయ్యడం—అదే తల్లులూ, అమ్మమ్మలూ ఇచ్చేది!

ఆశీర్వాదం అంటే, ‘మీకు అలా జరుగుగాక’ అని (ఆ దేవుణ్ణి) కోరుకొంటున్నాము అని!
స్థూలం గా ఇదీ!

మరి ఆకాంక్షని తెలియబరుస్తూ, గంపెడు పిల్లల్ని కనండి అంటే, నిజంగా కుచేల సంతానాన్ని పొందండి అనా!

యెప్పటికీ కాదు—అలా ‘ప్రయత్నించండి’—అంటే నిరంతరంగా శృంగారం లో మునిగి తేలండి—అని!

ఇంకా, యువ జంటలలో వుండే కొన్ని అపోహలని తొలగించి, పూర్తిగా వారిని శృంగారానికి తయారు చెయ్యడానికని!

అది యెందుకు?

అంటే, భార్యా భర్తలిద్దరూ సిగ్గూ, బిడియాలు వదిలేసి, పబ్లిగ్గా (అంటే అభ్యంతర మందిరాల్లోనే), ‘ఇన్ హిబిషన్స్ ‘ లేకుండా, అంటే ‘అపోహరహితం గా’ కలవగలిగినప్పుడే, ‘బీజావాపన’ జరుగుతుంది!

అందుకే, సంతానం తొందరగా కలగని దంపతులని దేవాలయం లో ‘నిద్దర్లు’ చెయ్యమనేవారు!

దేవాలయాలమీద ‘బూతు బొమ్మల్ని’ చెక్కించేవారు—మహారాజులు!

మహనీయుడు తాపీ ధర్మారావుగారు ‘దేవాలాయాలమీద బూతు బొమ్మలెందుకు?’ అని వ్యాస పరంపరనే వెలువరించారు! అవి ఈ రోజుకీ, రీసెర్చ్ స్కాలర్లకి రిఫరెన్స్ గ్రంధాలుగా వుపయోగపడుతున్నాయి!

ముప్ఫై యేళ్ళ క్రితమే, డాక్టర్ సమరం చెప్పినా, పుణే లో రజనీష్ ఆశ్రమం కట్టి, పబ్లిక్ శృంగారాన్ని ప్రోత్సహించినా, వీటన్నిటికీ పరమావధి—‘నిస్సిగ్గు శృంగారాన్ని' ప్రోత్సహించడమే!

అదే ఇప్పటికీ కావలసింది!

యేమంటారు?

Monday, April 13, 2009

దక్షిణ నాయకులు

“మీరేంచేస్తూంటారండి?”

“ఏదో! రచయితనండి”

“ఏం రాస్తారు?”

“అప్పుడప్పుడు కథలు – యెక్కువగా నాటకాలు”

“నేను నాటకాలు యెక్కువ చూడనండి. అయినా ఈ రోజుల్లో నాటకరంగం ఎక్కడుంది? తగలబడిపోయింది. మీ పేరు?”
“ఫలానా”

“ఉండండుండండి. మీరు సినీమాలు కూడా – “

“అప్పుడప్పుడు”

“దరిద్రం – ఈ రోజుల్లో సినిమాలు మరీ నాసిగా వుంటున్నాయండి”

“ఉండొచ్చు”

“మనవాళ్ళు బొత్తిగా సిగ్గూ, శరం వొదిలేసినట్టు అనిపిస్తుంది.
మనది పవిత్రమయిన దేశం. భారతం, రామాయణం, భాగవతాలు అవతరించిన కర్మభూమి. యిక్కడ యిలాంటి చవకబారు సినిమాలు వస్తున్నాయంటే తలవొంపులుగా వుంటుంది”

“వుండొచ్చు”

“నిర్మాతలు సరే – వాళ్ళు డబ్బుకోసం నానా గడ్డీ కరుస్తారనుకోండి. మీరు రచయిత కదా, నేనంటున్నానని కాదు – మీరంతగా దిగజారిపోవలసిన ఖర్మేం పట్టిందండి?”

”………….”

“మీరు సమాధానం చెప్పలేరులెండి. ఆమధ్యేదో సినిమా – పేరు గుర్తులేదు. దాంట్లో అన్నీ రెండర్ధాల మాటలే – ప్రేక్షకులు పడిచచ్చిపోతున్నారు. నాకు వొంటి మీద తేళ్ళు పాకినట్టయిపోయింది”

“అయిపోవచ్చు”

“ఇహ డాన్సులు – అమ్మోయ్ నాయనోయ్ – వాళ్ళు ఆడవాళ్ళుగా ఎలా పుట్టారా అనిపిస్తుంది – వొంటి మీద బట్టల్లేకుండా తైతక్కలాడడానికి”

“అనిపించవచ్చు”

“ఈ మధ్య ఎదో సినిమా – 'మొగుడున్నా ఫరవాలేదు ' అని అందులో – హవ్వ ఆ జయమాలిని కాబోలు – లేక మరెవరో – అబ్బబ్బ – అవేం నాట్యాలండీ”

“………”

“పాటలు బూతు – డాన్సుల్లో బూతు – గెంతుల్లో బూతు – బట్టలవెనుక శరీరం తెలుస్తుంది, తొడలు తెలుస్తున్నాయి. చూసే వాళ్ళకే సిగ్గేసేసింది”

“వెయ్యొచ్చు”

“ఇదంతా చాలదన్నట్టుగా – ఆరుసార్లు నాకు బాగా గుర్తు – ఆరుసార్లు నేలమీద దొర్లింది – రొమ్ములు తెలిసేలాగ – నాముఖమే ఎర్రగా అయిపోతే ఆడవాళ్ళ మాటేమిటి చెప్పండి”

“చెప్పలేం”

“పైగా కన్నుగీటడం – పెదాలు కొరకడం – సైగలు చేయడం ముసిలిముండావాణ్ణి నాకే మనస్సు రెపరెపలాడింది”

“అయిపోవచ్చు”

“ఇలాంటి సినిమాలు చూస్తే ప్రజలు చెడిపోరా అని నా సూటి ప్రశ్న. నన్నడిగితే యిలాంటి సినిమాలు తీసిన వాళ్ళని తీవ్రం గా శిక్షించాలంటాను.”

“అనొచ్చు”

“ముభావంగా తలూపుతారేకాని, నా ప్రశ్నలకి సమాధానం చెప్పరేం?”

“(అయ్యా!) మొగుడున్నా ఫరవాలేదు లో జయమాలిని ‘ఆరుసారు దొర్లడం’, ‘ఏడుసార్లు కన్నుగీటడం’ మీకెలా తెలిసింది?”

“ఆ ఏదో తప్పనిసరై చూశాలెండి. మా మనవడు బలవంతం చేస్తే”

“ఎన్ని సార్లో?”

“నాలుగయిదు సార్లు”

“అదే నా సమాధానం”

(శ్రీ గొల్లపూడి మారుతీరావు ‘జీవనకాలం’ – 16-07-1982)

మరి ఇప్పుడు?

Friday, February 20, 2009

ఓ 'పొడవు ' జోకు

ఇవాళేం చూశావు నా ‘బల్లం’!

“పొడవు” (బారు) లో, మూడో గుండ్రం (రవుండు) లో వున్నారు స్నేహితులు!

విస్కీ పోశాక, సోడా ఓపెన్ చెయ్యడానికి ఓపెనర్ పక్క టేబులు దగ్గరకి పట్టుకెళ్ళి పోయాడు బేరర్.

వాళ్ళలో ‘పుంజుతోకల కలుపరి ‘ (కాక్టెయిల్ మిక్సర్) సోడా మూతని తన పళ్ళ మధ్య ఇరికించి, ఓపెన్ చేసేశాడు!

స్నేహితుల్లో ఒకడు—ఓర్నీ! పళ్ళూడిపోగలవు జాగ్రత్త—అంటూనే వున్నాడు!

‘అర్రే! ఇప్పుడేమి చూశావు నా బలం! డిసెంబరు 31 న అయితే………’

“వార్నీ! ఆ రోజునైతే పొడవు రెండడుగులూ, వెడల్పు ఒక అడుగూ పెరిగిపోతుందేమిటిరా నీ ‘బల్లం’?”

‘కాదురా. ఆరోజు ఆరుగురు కూర్చున్నాం! గుండ్రానికి 3 చొప్పున, న్యూయియర్ వచ్చేశాక, నిద్రకు వెళ్ళేలోపల 18 సోడాలని నా ఓన్ పళ్ళతో ఓపెన్ చేశాను!’

‘ఒరే! ఓన్ పళ్ళు కాకుండా అద్దె పళ్ళు కూడా వుంటాయేమిట్రా?”

“పళ్ళ సంగతేమోగానీ, ‘బల్లం’ మాత్రం నా స్వంతం రా!”

"నిజంగా నీ 'బల్లానికి ' హేట్స్ ఆఫ్ రా!"

(ఇది శృంగార సంభాషణేనా?)

Tuesday, February 17, 2009

శోభనం!

శోభనం!

ప్రతి పురుషుడూ (పెళ్ళైనా కాకపోయినా, పెళ్ళైతే ఇంకా తొందరగా జరగాలని) ఇష్టపడేది!

గోదావరి జిల్లాల్లో, శూద్ర కులాల్లో యానాళ్ళు గా వ్యవహరించే దీన్ని, శ్రోత్రియులు ‘పునస్సంథానం ‘ అనీ, ఆడవాళ్ళు ‘కార్యం’ అనీ, పురోహితులు ‘గర్భాదానం ‘ అనీ, సామాన్యులు ‘గదిలోకి పంపడం ‘ అనీ, యానాళ్ళంటే పెళ్ళి కొడుక్కి సంబంధించిన వాళ్ళు తాగి తందనాలాడే సమయం అనీ, కొంత మంది ‘భూకంప ముహూర్తం‘ అనీ, ఇంకొంతమంది ‘స్థంభ ముహూర్తం‘ అనీ, మరి కొంత మంది ‘చిలకల పండగ’ అనీ (గదిలో పంచదార చిలకలు పెడతారు కదా!) రకరకాలుగా వ్యవహరిస్తారు!

ఇదివరకు, ‘ఆష్టవర్షాత్ భవేత్కన్యాం’ అని యెనిమిదేళ్ళలోపే ఆడ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసేవారు! కొండొకచో, కన్యాశుల్కం అమల్లో వున్న రోజుల్లో, కడుపులో వున్న బిడ్డలకి కూడా పెళ్ళిళ్ళు చేసేసే వారు! (అంటే పుట్టిన వెంటనే—ఆడ పిల్ల అని తెలిసిన వెంటనే అనుకోండి!)

ఆ తరవాత, కొన్ని సంవత్సరాల తరవాత, పిల్ల వ్యక్తురాలైనప్పుడు, ఆడపిల్ల తండ్రి మళ్ళీ అల్లుడి తండ్రిని సంప్రదించి, మళ్ళీ కొన్ని కానుకలు ఇచ్చుకొని, ‘పునస్సంధానానికి’ (పెళ్ళి అంటే సంధానం) అనుమతిబడసి, వారిని మళ్ళీ సకుటుంబ సపరివార సమేతంగా ఆహ్వానించి, జరిపించేవారు.

ఇప్పుడు—(శంకరాభరణం లో పట్టాభి అన్నట్లు) ‘రైళ్ళు, బస్సులు, రాకెట్లు, జాకెట్లు, జట్లు—అన్నీ వచ్చేసాయా! స్పీడు! లోకమంతా స్పీడే!'—అన్నట్లు—పెళ్ళి నిశ్చయమయ్యాక, రెండు మూడు నెల్లు టైముంటే, సెల్ఫోను లోనే ముద్దూముచ్చట్లు కానిచ్చేసి, ఇంకా వీలైతే యేకాంతాలు గడిపేసి, కొండొకచో ‘అదీ’ కానిచ్చేసి, పెళ్ళి ముహూర్తం ఏ అర్ధరాత్రో అయితే, యేడు గంటలకి రిసెప్షను పేరుతో ఇద్దర్నీ పక్కపక్కని కూచోబెట్టి, టాకింగులూ, టచ్చింగులూ, ఒకచో కిస్సింగులూ అయ్యాక, ముహూర్తం అవగానే, శోభనాలూ కానిచ్చేస్తున్నారు!

బాగుంది గానీ, ఇప్పుడో చిన్న సమస్య! యేమిటంటే, ఆడ పిల్లలు తక్కువైపోయారు!

అబ్బాయిలూ! జాగ్రత్త! మళ్ళీ కన్యాశుల్కం రోజులు వస్తున్నాయి!

చూద్దామా?

Sunday, February 8, 2009

శీర్ణ మేఖల

శీర్ణ మేఖల


స్నేహంగురించి చెప్పాలంటే—దుర్యోధనుణ్ణీ, కర్ణుణ్ణీ చెప్పుకోవాలట!

కవిగారు యెవరో గుర్తులేదు గాని, పై శీర్షికతో ఓ పద్యపాఠం వుండేది మాకు.
దానిలో వర్ణిస్తాడు వాళ్ళ స్నేహాన్ని.


మేఖల అంటే, తెలుగులో ‘మొలనూలు’ అంటే మగాళ్ళు పేంటులకి తగిలించుకునే తోలు బెల్టు లాంటిది.

దుర్యోధనుడి కాలంలో, స్త్రీలు కూడా చీరకట్టుకొని, దానిపై మొలనూలు పెట్టుకునేవారట—తోలుదేం ఖర్మ! బంగారంతో చేసి, మణులూ, రత్నాలు పొదగబడ్డవి!

ఒకరోజు, కర్ణుడు దుర్యోధనుడి భార్య భానుమతితో పాచికలాట ఆడుతున్నాడట!
ఆట మంచి పట్టులో వుండగా, దుర్యోధనుడు ఆ మందిర ప్రవేశం చేశాడట.
చప్పుడికి దిగ్గున లేవబోయింది భానుమతి.

ఆటమీదే దృష్టి కేంద్రీకరించిన కర్ణుడు, చటుక్కున ఆమె కొంగుపట్టుకున్నాడట—‘ఆటవకుండా వెళ్ళిపోతావేం!’ అన్నట్టు.

ఆ ధాటికి, ఆమె ధరించిన మొలనూలు తెగిపోయిందిట! అప్పటి సీను ఊహించుకోండి!

ఆ మొలనూలు తెగడాన్ని వర్ణిస్తూ ‘క్వణదణు కింకిణీ కలిత……..’ అని ఓ పద్యం!
చదువుతుంటే, ఆ మణులూ అవీ, నేల మీద యే ధ్వని తో పడ్డాయి, అవి ఎలా మళ్ళీ మళ్ళీ లేస్తూ పడుతూ, దొర్లాయి ....కళ్ళకు కట్టినట్టుగా శబ్దాలంకారం!

దుర్యోధనుడి డైలాగు—‘ అయ్యో మిమ్మల్ని అనవసరంగా డిస్టర్బ్ చేశానా? అని!

అదీ వాళ్ళ మధ్య స్నేహం!