Wednesday, August 11, 2010

ఫ్రెంచ్ శృంగార కథలు

"మెయిడ్ ఆఫ్ థిలౌస్"

(ముందు టపా తరువాయి భాగం)

మేరీ, తల్లికిచ్చిన మాట ప్రకారం, లార్డ్ గారెన్ని మెత్తటి కోరికలు కోరినా, తేనెపూసినట్లు మాట్లాడినా, ఎన్ని నక్కజిత్తులు ప్రయోగించినా, "పెళ్లి" అనే మాట మీదే నిలబడిపోయిందట--చివరిదాకా!

రోజూ ఆమెని యెదురుగా చూస్తూ, లొట్టలు వేయడం తప్ప యేమీ చెయ్యలేకపోతున్న లార్డ్ గారు తన దగ్గర 'స్టెవార్డ్' గా పని చేస్తున్న ఓ డెభయ్యేళ్ల పైబడ్డ ఆయన్ని ఆశ్రయించి, "నీ వొళ్లు వెచ్చగా వుండాలంటే, పెళ్లి చేసుకొంటే మంచిది" అని అతన్ని అతికష్టమ్మీద వొప్పించి, అతనికి కొంతా, మేరీకి కొంతా కట్నం ఇచ్చి, ఖర్చులు పెట్టుకొని, వాళ్లిద్దరికీ పెళ్లి చేసేశాడట.

కోటలో ఆమెకో గది కూడా కేటాయించాడట.

ఇక ఆమెకి చెప్పడానికి యేమీ అభ్యంతరాలు లేకపోవడం తో, లార్డ్ గారికి, 'మీరు మాకెన్ని తిండిగింజలిచ్చారో, అన్ని కౌగిలింతలు నిరభ్యంతరం గా తీసుకోవచ్చు' అని అనుమతి ఇచ్చేసిందట. (వీడికి ఈ వయసులో ఓ కంకి మీదుండే గింజలు చాలేమో అనుకుంటూ)

పెళ్లి వేడుకలన్నీ అయిపోయాక, ఓ రోజు భార్య నిద్రించిందని నిర్ధారించుకొని, మేరీ గదిలో చేరి, అందం గా నిద్రిస్తున్న ఆమె ని చూసి, పక్కలో చేరాడట. పాపం అనుభవం లేని పిల్ల కదా అని జాగ్రత్తగా ప్రవర్తిస్తూ, జావకారిపోయాడట!

అప్పుడా 'వెంచ్', "బాబుగారూ! మీరింకా అక్కడ వుంటే--వున్నారనే అనుకుంటున్నాను--మీ గంటని కొంచెం వేగం గా వూపండి!" అందట.

ఈ మాట బయటివాళ్లకి యెలా తెలిసిందో గానీ, అప్పటినించీ "మెయిడ్ ఆఫ్ థిలౌస్" ప్రసిధ్ధి చెందిందట. దాంతో పాటు "ఫ్రిక్నెల్" అనే మాట కూడా!

(ఫ్రిక్నెల్ అంటే, మొదటిరాత్రి తన చేతుల్లో 'వుండకూడదు' అని ప్రతి మగాడూ కోరుకొనేలాంటి భార్య అని వివరణ ఇచ్చాడు రచయిత)

అదండీ కథ!  

Monday, August 9, 2010

ఫ్రెంచ్ శృంగార కథలు

(కథాక్రమం మారిపోకుండా, పాత టపానే ఎడిట్ చేసి ప్రచురిస్తున్నాను--గమనించండి)


వుపోద్ఘాతం

19 వ శతాబ్దపు ఫ్రెంచ్ రచయిత "బాల్జాక్" వ్రాసిన మొదటి 10 కథలు మార్చ్ 1832 లో పారిస్ లో ప్రచురింపబడ్డాయి.

ఇవి ముఖ్యం గా సరదా శృంగార కథలు.

తరవాత ఇంకో పదీ, ఇంకో పదీ మొత్తం 30 కథలు ప్రచురించారు. ఇవి 1837 కి పూర్తయ్యాయిట.

వీటిని జనవరి 1874 లో మొదటిసారి ఇంగ్లీష్ లోకి అనువదించారు--అనువదించినాయన పేరు లభ్యం కాలేదు.

వీటిని మనదేశం లో జైకో పబ్లిషింగ్ హౌస్ వారు తమ "జైకో క్లాసిక్స్" క్రింద ప్రచురించారు--యే సంవత్సరమో కూడా లభ్యం కాలేదు.

ప్రచురింపబడ్డప్పుడు, 450+ పేజీలున్న ఈ పుస్తకం వెల రూ.3.75 పై.లు.

అప్పటి ఇంగ్లీషు లోనే, అద్భుతమైన కథలూ, కథనం--ఒరిజినల్ ఫ్రెంచ్ లో ఇంకెంత బాగుండేవో అనిపిస్తాయి.

నాకు తోచినట్టు క్లుప్తం గా తెలుగులో వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాను--చదవండి!


మెయిడ్ ఆఫ్ థిలౌస్

వేల్లెన్స్ అనే ప్రాంతానికి 'లార్డ్' గారి కోట 'థిలౌస్' అనే వూరికి దగ్గర్లోనే వుంటుంది.

ఆయన భార్య, ఆయనని వివాహ కాంట్రాక్టుల్లో చెప్పబడే యేవిధమైన సుఖాలనీ అనుభవించనివ్వదట!

యెందుకంటే, ఈయనకి అప్పటికే 60 యేళ్లు--పైగా అపరిశుభ్రం గా, కౄర జంతువుల్ని వేటాడుతూ అలాగే వుంటాడట! 

అయినా ప్రతీ జంతువూ తన జోడీ ని వెతుక్కున్నట్టు, ప్రతీ గిన్నెకీ--అది యెంత అందవికారం గా వున్నా, ఓ మూత వుంటుంది అన్నట్టు--అందమైన గిన్నెలకోసం వెతుకుతూ వుంటాడట.


ఓసారి, థిలౌస్ లో ఒక నేతగాడి వితంతువు వుందనీ, ఆమెకి ఓ పదహారేళ్ల, చాలా అందమైన కూతురు వుంది అనీ, ఆమెని యెక్కడికి వెళ్లినా--కాలకృత్యాలక్కూడా--ప్రక్కనే వుండి, జాగ్రత్తగా కాపాడుకొంటూ వుంటుంది అనీ యెవరో చెప్పారట.

అనుకోకుండా ఓ రోజు వర్షం లో చిక్కుకుపోయిన ఆయన, ఒక చోట చలిమంట దగ్గర కూర్చొని వున్న మిగిలిన వాళ్లతోపాటూ ఆ తల్లీ కూతుళ్లు కూడ వుండడం తో, వాళ్లతో మాటలు కలపడానికి ప్రయత్నిస్తూ, మంటలో ఓ కట్టెని చేర్చి, "హమ్మయ్య! ఇప్పటికి మీ అమ్మాయి కళ్లు పుట్టిస్తున్న వేడి తో సమంగా ఈ మంట కూడా వస్తోంది" అన్నాడట!

దానికా తల్లి "యేం లాభం అయ్యగారూ! మాకు ఆ మంట మీద వండుకోడానికి యేమీ లేదు కదా!" అని నిట్టూర్చిందట.

తరవాత సంభాషణ ఇలా సాగిందట:

"ఓ పని చెయ్యి--మా ఆవిడకి మెయిడ్ గా మీ అమ్మాయిని పంపితే, మీకు రోజూ రెండు దుంగల్ని ఇస్తాను!"

"అయ్యా! ఆ దుంగల్ని మంటపెట్టి, యేమి వండుకోవాలి?"

"మంచి ఆహారం వండుకో--నీకు ప్రతీ పంట రాగానే ఓ బస్తాడు ధాన్యం ఇస్తాను!"

"ఇస్తారు బాగానే వుంది కానీ వాటిని నిలవ చేసుకోడానికి నాకు పాత్రలు లాంటివేమీ లేవు కదా?"

"సరే! నేను పాత్రలు కూడా పంపిస్తాను!"

"మరి వర్షం వస్తే అవన్నీ పాడయిపోవూ? మాకో ఇల్లంటూ లేదు మరి!"

"అంతేనా! ఆ కనిపిస్తున్న ఇంట్లో నాదగ్గర పనిచేసే వేటగాడు ఒకడుండేవాడు--ఈ మధ్యనే ఓ అడివిపంది వాణ్ని చంపేసింది! ఆ యింట్లో మీ జీవితాంతం వుండచ్చు!"

"అయ్యా! మీరు నిజమే చెపుతున్నారా?"

"దేవుళ్లందరిమీదా ప్రమాణం!"

"మరి నా కూతురికేమిస్తారు?"

"ఆమె మా సేవలో వున్నంతకాలం, నేనేమిస్తే అవన్నీ ఆమెవే!"

"అయితే, మా దుంగల దగ్గరనించీ అన్నీ వ్రాయించి, నోటరీ చేయిస్తే, నాకేమీ అభ్యంతరం లేదు!"

"అయ్యో! ప్రవక్తలందరిమీ ఒట్టేసి చెపుతున్నానుకదా! నా మాట మీద నమ్మకం లేదా?"

"నేనెన్నాళ్లుంటానో తెలీదు. నిన్న మతగురువు బోధలో, మన పిల్లల గురించి దేవుడికి సమాధానం చెప్పవలసి వుంటుంది అన్నాడు. అందుకని......"

"సరే! సరే! నోటరీని వెతుక్కో!"

వెంటనే చుట్టుపక్కల వాళ్లలో ఒకడు పరుగెత్తి, నోటరీని తీసుకొస్తే, కాయితాలు వ్రాయించి, తన 'గుర్తూ' (చదువు రాదు కదా!), ముద్రా వేశాడట.

అప్పుడావిడ, "అమ్మాయీ! మేరీ ఫికెట్! ఈ పెద్దాయన మంచివాడే అయి వుండచ్చు కానీ, మిగిలిన మగాళ్లతో జాగ్రత్త! ముఖ్యమైన శీలాన్ని మాత్రం కోల్పోకు--నరకం లో పడతావు!" అంటే, "తప్పకుండా గుర్తుంచుకుంటానమ్మా!" అని కోటకి పయనమయ్యిందట.

అమ్మగారికి కూడా మేరీ బాగా నచ్చిందట!

......(ఇంకా వుంది)

Saturday, July 17, 2010

ఖర్చులు

లెఖ్ఖలు

ఓ షావుకారు వుండేవాడు. ఆయనకో చిన్నిల్లు. అక్కడకి వెళ్ళినప్పుడల్లా ఓ మిఠాయి పొట్లమో, పువ్వుల దండో, అత్తరు సీసానో ఇంకా వేటి కోసమో యేవో చిల్లర ఖర్చులు చెయ్యవలసి వచ్చేది. అవన్నీ తన సాదరు ఖర్చుల్లో వ్రాయమని చెప్పేవాడు తన గుమాస్తాకి.

ఓ సారి, ఈ లాంటి చిల్లర ఖర్చు సంవత్సరానికి యెంతవుతోందో తెలుసుకోవాలని ఆలోచన వచ్చింది ఆయనకి. 

అప్పటి నించీ, గుమాస్తాని "అందు నిమిత్తం ఖర్చు" అని ఓ ఖాతా తెరిచి, అందులో ఆ ఖర్చుల్ని వ్రాయమని ఆదేశించాడు.

నెలాఖరున ఆ ఖాతా పరిశీలిస్తుంటే, అన్నీ పదీ, పరకా ఖర్చులే వ్రాయబడ్డా, చివరలో యేకం గా వెయ్యి రూపాయల ఖర్చు చూసి, గుమాస్తాని "ఇదేమిటీ? ఇంత ఖర్చు ఈ ఖాతాలో నేనెప్పుడు పెట్టానూ?" అని గద్దించాడట.

"అదీ...మ్యా...మ్యా...మ్యా...అదీ...నా...నా...నా--'అందు నిమిత్తం' ఖర్చండీ...పూర్తి నెలకి ఒకే సారి తీసుకున్నా..." అని నీళ్ళు నమిలాడట, తనుకూడా ఓ చిన్నిల్లు పోషిస్తున్న గుమాస్తా.

Tuesday, July 6, 2010

సందేహం

నివృత్తి

నా ఇంకో కెండె (ఆయన పేరు 'కొండబాబు'--మా యిద్దరికీ, జీవితాంతం ఒకళ్ళనొకళ్ళు 'మన్నించుకొంటూనే' వుండాలనీ, ఒరే అనో, వాడూ, వీడూ అనో అనుకోకూడదని ఓ వొప్పందం వుంది!) "బొమ్మా? బొరుసా?" (బాలచందర్) చిత్రం చూశాక, ఓ పాట గురించి తరచూ ప్రస్తావించేవాడు--మహదానందపడిపోతూ, లేస్తూ!

చంద్రమోహన్ కీ, 'వెన్నీర్ ఆడై' నిర్మలకీ ఓ పాటుంది--"చేల్లే పోవోయ్ వగలాడీ"--అంటూ!

అందులో, చంద్రమోహన్ కి కోపం తారాస్థాయికి చేరుకోగానే, "నువ్వసలు ఆడదానివా?" అని క్రొశ్నిస్తాడు. దానికి ఆమె, తన '..........ని యెగరేసి దులిపి'  "అర్రె!" అని, కొంచెం గేప్ ఇచ్చి, "చాల్లే పోవోయ్......" అని పాడుతుంది.

మా కొండ ముసిముసిగా నవ్వుకుంటూ, "భలే సందేహ నివృత్తి చేసింది కదండీ వాడికి?" అని చెప్పి చెప్పి మరీ నవ్వేవాడు!

యెలా వుంది?

Tuesday, May 11, 2010

సెన్సారు

అశ్లీలం

ఈ మధ్య మన బాల సుబ్బు తన 'పాడుతా తీయగా' నో, ఇప్పుడొస్తున్న యేదో ప్రోగ్రాములోనో, తన ప్రక్కనున్న న్యాయ నిర్ణేతతో, ఓ పాట గురించి ప్రస్థావన చేస్తూ, 'సెన్సారువారి చెవులుగప్పి, బ్రతికి బట్టకట్టింది' అనో, ఇలాంటి అర్థం వచ్చే మాటలో యేవో అన్నాడు.

బ్యాక్ గ్రవుండులో బొంబాయి చిత్రం లోని "ఆ అరబిక్కడలందం....నీలోనే చూశానే.....పట్టూ రవికల (లో) విదియా తదియా వైనం చూశానే" అనే పాట వినిపించింది!

అంటే, మన బాల సుబ్బు ఆ మాటల్ని 'అశ్లీలం'గా భావించినట్టే కదా?

పట్టు రవికలో, విదియ చంద్రుణ్ణీ, తదియ చంద్రున్నీ (కాకుండా వాళ్ళ వైనాన్ని మాత్రమే) చూశానే--అంటే, అది అశ్లీలం యెలా అయ్యింది?

నిజంగా ఇది యెంత చక్కని కవిత్వ భావన!

మరి ఇదే అశ్లీలమనుకొంటే, 'కమలాకుచ చూచుక కుంకుమతో' అన్న సుప్రభాత స్థుతి ని యేమనాలి?

అన్నమయ్య వ్రాసిన, మనం పాడుకొంటున్న, 'అయ్యో చమరించె....ప్రాయంపు గుబ్బలమీద' ని యెవరు సెన్సారు చేస్తారు?

ఇలాంటి వాళ్ళని వర్ణించడానికీ, వాళ్ళ మానసిక ప్రవృత్తిని వర్ణించడానికీ శతాబ్దల క్రితమే ఇంగ్లీషులో మాటలు వున్నాయి--'ప్రూడ్', 'ప్రూడరీ' అని.

డియర్ బాల సుబ్బూ--నువ్వెందుకు 'ప్రూడ్' అనిపించుకోవాలి?

Thursday, April 15, 2010

ఓ సరసమైన కథ

ఓ రాత్రి కథ

ఓ పాతికేళ్ళక్రితం ఓ తెలుగు కథానిక చదివాను. ఇంటిపేరుతో సహా ఓ అయిదారు అక్షరాలుండే ఓ రచయిత్రి వ్రాసిందని గుర్తు. ఆవిడ పేరు గుర్తులేదు. స్వాతి వీక్లీలోనో, ఆంధ్ర భూమి వీక్లీలోనో చదివిన గుర్తు.

కథ టూకీగా.............

నిజామాబాదు నించో యెక్కడి నించో మన హీరోయిన్ హైదరాబాదుకి బస్సులో ప్రయాణిస్తూ వుంటుంది. ఆవిడకి ఓ ముఫ్ఫై యేళ్ళు. ఇద్దరు పిల్లలూ హైదరాబాదులో చదువుకుంటున్నారు. భర్త ఓ వున్నతోద్యోగి. యేదో వుద్యోగ పని మీదే వెళ్ళి తిరిగి వస్తూంది ఆవిడ.

బస్సులో రకరకాల జనం. వాళ్ళలో తనకి యెడం పక్క వున్న సీట్లలో ఓ అబ్బాయి--35 యేళ్ళవరకూ వుండచ్చు--స్ఫురద్రూపి, గిరజాల జుట్టూ, నవ్వే కళ్ళూ వగైరా--అయినా చాలా హుందాగా వుంటాడు.

తీరా కొంత దూరం వెళ్ళేటప్పటికి, బస్సు బ్రేక్ డౌన్ అవుతుంది. డ్రైవరూ, కండక్టరూ తిప్పలు పడి, వాళ్ళ వల్ల కాక, యేదో పార్టు తెచ్చి వెయ్యాలి--హైదరాబాదు నించే రావాలి--వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. రిపేరు అయ్యేసరికి పొద్దున్న ఆరు అవ్వచ్చు. ప్రయాణికులు మీ యేర్పాట్లు చేసుకొంటామంటే, టిక్కెట్టు డబ్బులు తిరిగి ఇచ్చేస్తాం. లేకపోతే, మాతో ఇదే బస్సులో పొద్దున్న 6 గంటలకి బయలుదేర వచ్చు--అని ప్రకటించేస్తారు.

ప్రయాణికులంతా దొరికిన లారీనో ఇంకోటో పట్టుకొని వెళ్ళిపోతూంటారు. హీరోయిన్ ఓ పక్కా, హీరో ఓ పక్కా నిలబడి కాలక్షేపం చేస్తూండగా, అబ్బాయి అడుగుతాడు--మీతో యెవరూ లేరా? ఒక్కళ్ళే వెళుతున్నారా?--అని. 

అవునని సమాధానం ఇచ్చిన ఆమె, మీరూ అంతేననుకుంటా--అని, ఇక్కడ నిలబడి దిక్కులు చూసే బదులు, దగ్గర్లో యేదో వూరు వున్నట్టుంది--యెలాగా వెన్నలగానే వుంది కాబట్టి, నడుచుకుంటూ ఆ వూరు చేరితే, పొద్దున్న వరకూ అక్కడెక్కడైనా కూచోవచ్చేమో? అంటుంది.

రెండు ఫర్లాంగులు నడిచేటప్పటికి, ఓ యెత్తరుగుల ఇల్లు కనిపించి, ఇద్దరూ ఓ అరుగు మీద కూర్చుంటారు. అప్పటికే రాత్రి పదకొండు అయి వుంటుంది.

ఆలికిడికి నిద్రలేచిన ఆ యింటావిడ బయటికి వచ్చి, విషయం తెలుసుకొని, 'అయ్యో! తెల్లవార్లూ అరుగుమీద కాలక్షేపం చెయ్యడమెందుకు? మా అబ్బాయీ కోడలూ వేరే వూరు వెళ్ళారు. పిల్లలతో నేనొక్కదాన్నే లంకంత కొంపలో వున్నాను--వాళ్ళ గది కాళీగానే వుంది--మీరు ఆ గదిలో వుండి, పొద్దున్నే లేచి వెళ్ళవచ్చు ' అని మొహమాట పెట్టేస్తుంది వాళ్ళని భార్యా భర్తలనుకొని.

వాళ్ళ మనసుల్లో యేమున్నా, యెందుకొచ్చిన గొడవ అని సరే అనేస్తారు. ఆవిడ ఆ గది తలుపు తీసి, తినడానికి యేవో, మంచినీళ్ళూ పెట్టి, 'తలుపేసుకోండమ్మా--పొద్దున్నే లేపుతాను!' అంటూ వెళ్ళిపోతుంది.

ఆ రాత్రి ఇద్దరూ నిద్రపోలేదు!

ఉదయాన్నే అయిదున్నరకి బయటికి వచ్చి, ఇంటావిడకి చెప్పి, బయలుదేరతారు బస్సు దగ్గరకి.

'మీ ఫోన్ నెంబరు.......' అని అబ్బాయి అడగబోతే, 'ప్లీజ్! నిన్నరాత్రి ఈ దోవలో మనం యెలా అపరిచితులమో, అలాగే విడిపోదాం. మళ్ళీ మనం ఒకర్నొకరు కలవడానికి ప్రయత్నించద్దు. మీకెప్పుడైనా ఇంకో స్త్రీతో ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మీరూ, నాకవకాశం వస్తే నేనూ ఈ మధుర ఙ్ఞాపకాన్ని గుర్తు చేసుకుందాం--అంతే!' అంటుంది.

తరవాత కథ కంచికీ, మనం ఇంటికీ!

ఆ రోజుల్లోనే ఇలాంటి కథ వ్రాసిన రచయిత్రికి హేట్సాఫ్ చెపుదామా?

Tuesday, March 16, 2010

రసికప్రియ

కథా ప్రారంభం

"అతడు ఆత్రం గా చీరను పైకెత్తాడు. క్రింద వున్న లంగాని కూడా పైకెత్తాడు. ముఖమల్ లా మెత్తగా చేతికి తగిలింది--తడుముతూ పట్టుకున్నాడు--ఆ పర్సు ని--అతని చెయ్యి ఇంకా ఆ పెట్టెలోనే వుంది.

'యేయ్! యేం చేస్తున్నావు?' ప్రశ్నించింది ఆమె.....మరిదిని."

మా చిన్నప్పుడు రసిక ప్రియలో ఓ కథా ప్రారంభం ఇది.

'నిన్న నాకొచ్చిన ఇంటర్వ్యూ కవరు నీ పెట్టెలో పెట్టానన్నావుకదా.....చూస్తున్నాను ' అన్నాడు మరిది.

'అడిగితే నేనే తీసి ఇద్దును కదా?' అంటూ లోపలకి వచ్చి, పెట్టెలోంచి తీసి ఇచ్చిందా కవరు!

ఇదీ తరవాతి భాగం.

తరవాత కథ తరవాత.

యెలా వుంది?