నివృత్తి
నా ఇంకో కెండె (ఆయన పేరు 'కొండబాబు'--మా యిద్దరికీ, జీవితాంతం ఒకళ్ళనొకళ్ళు 'మన్నించుకొంటూనే' వుండాలనీ, ఒరే అనో, వాడూ, వీడూ అనో అనుకోకూడదని ఓ వొప్పందం వుంది!) "బొమ్మా? బొరుసా?" (బాలచందర్) చిత్రం చూశాక, ఓ పాట గురించి తరచూ ప్రస్తావించేవాడు--మహదానందపడిపోతూ, లేస్తూ!
చంద్రమోహన్ కీ, 'వెన్నీర్ ఆడై' నిర్మలకీ ఓ పాటుంది--"చేల్లే పోవోయ్ వగలాడీ"--అంటూ!
అందులో, చంద్రమోహన్ కి కోపం తారాస్థాయికి చేరుకోగానే, "నువ్వసలు ఆడదానివా?" అని క్రొశ్నిస్తాడు. దానికి ఆమె, తన '..........ని యెగరేసి దులిపి' "అర్రె!" అని, కొంచెం గేప్ ఇచ్చి, "చాల్లే పోవోయ్......" అని పాడుతుంది.
మా కొండ ముసిముసిగా నవ్వుకుంటూ, "భలే సందేహ నివృత్తి చేసింది కదండీ వాడికి?" అని చెప్పి చెప్పి మరీ నవ్వేవాడు!
యెలా వుంది?
No comments:
Post a Comment