లెఖ్ఖలు
ఓ షావుకారు వుండేవాడు. ఆయనకో చిన్నిల్లు. అక్కడకి వెళ్ళినప్పుడల్లా ఓ మిఠాయి పొట్లమో, పువ్వుల దండో, అత్తరు సీసానో ఇంకా వేటి కోసమో యేవో చిల్లర ఖర్చులు చెయ్యవలసి వచ్చేది. అవన్నీ తన సాదరు ఖర్చుల్లో వ్రాయమని చెప్పేవాడు తన గుమాస్తాకి.
ఓ సారి, ఈ లాంటి చిల్లర ఖర్చు సంవత్సరానికి యెంతవుతోందో తెలుసుకోవాలని ఆలోచన వచ్చింది ఆయనకి.
అప్పటి నించీ, గుమాస్తాని "అందు నిమిత్తం ఖర్చు" అని ఓ ఖాతా తెరిచి, అందులో ఆ ఖర్చుల్ని వ్రాయమని ఆదేశించాడు.
నెలాఖరున ఆ ఖాతా పరిశీలిస్తుంటే, అన్నీ పదీ, పరకా ఖర్చులే వ్రాయబడ్డా, చివరలో యేకం గా వెయ్యి రూపాయల ఖర్చు చూసి, గుమాస్తాని "ఇదేమిటీ? ఇంత ఖర్చు ఈ ఖాతాలో నేనెప్పుడు పెట్టానూ?" అని గద్దించాడట.
"అదీ...మ్యా...మ్యా...మ్యా...అదీ...నా...నా...నా--'అందు నిమిత్తం' ఖర్చండీ...పూర్తి నెలకి ఒకే సారి తీసుకున్నా..." అని నీళ్ళు నమిలాడట, తనుకూడా ఓ చిన్నిల్లు పోషిస్తున్న గుమాస్తా.
2 comments:
మీ పోస్టు చూశాక ఒక చిన్న జోకు చెప్పాలనిపించింది. చదవండి.
. నగరంలో పనిచేసే ఒక సుబ్బారావుకి నగరంలో అమ్మాయిలంటే భయం,వాళ్ళకి శీలం ఉండదని.తన కొలీగ్సుని చూశాక అతగాడికి కలిగిన అభిప్రాయం అది.అంచేత ఏరికోరి అమాయకంగా కనిపించే ఒక పల్లెటూరి పిల్లని పెళ్ళి చేసుకొని నగరానికి తీసుకొచ్చాడు ఒక సాయంత్రం పెళ్ళంతొ కలిసి అలా నడుచుకొంటూ యాక్సిడెంటల్ గా ఒక రెడ్ లైట్ ఏరియా మీదుగా వెళ్తారు. సాయంత్రం కావడంతో అందరూ అలంకరించుకొని గుమ్మాల దగ్గర నించుని వగలు ఒలక బోస్తూ ఉంటారు. ఆ పల్లెటూరి పిల్ల సుబ్బారావుని అడుగుతుంది ఎవరు వాళ్ళు, ఎందుకలా నించుని ఉన్నారని.
అసలు వేశ్యలంటే ఎవరో తెలియని సచ్చీలతని పెళ్ళి చేసుకున్నందుకు తనని తాను అభినందించుకొని వాళ్ళు ఎవరో, ఎందుకలా నించున్నారో చెబుతాడు. "అలా చేస్తే వాళ్ళకేం వస్తూందండీ?" అమ్మాయకంగా అడిగిందా పిల్ల. మళ్ళీ సంతోషపడి, "అలా చేసినందుకు వాళ్ళకి డబ్బులిస్తారు" అని చెప్పాడు. "దొంగ నాయాలా!" అన్నదా పిల్ల ఒక్క సారిగా. సుబ్బారావు గతుక్కుమన్నాడు.
"మిమ్మల్ని కాదు లెండి.మా వూళ్ళో శెట్టిగాడిని.దొంగ నాయాలు. నాతో ఎన్ని సార్లు చేశాడు.ఎప్పుడూ బెల్లం ముక్కే ఇచ్చేవాడు.ఒక్క సారి ఒక్క పైసా ఇచ్చిన పాపాన పోలేదు."
అప్పుడు సుబ్బారావు మొహం ఎలా ఉంటుందో చెప్పాలా?
డియర్ '.....దండలు!'
జోకు బానే వుంది.
ధన్యవాదాలు.
Post a Comment